Chandrababu: డీప్ టెక్నాలజీ సరికొత్త ఆవిష్కరణ 16 d ago
విశాఖలో నేషనల్ డీప్ టెక్ కాంక్లేవ్ సదస్సును సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఐటీ గురించి ఎవరు మాట్లాడినా హైటెక్‌సిటీ ప్రస్తావనే వస్తుందని, అప్పట్లోనే ఐటీ రంగంలో అవకాశాలు అందిపుచ్చుకున్నామని వివరించారు. ఇప్పుడు డీప్ టెక్నాలజీ సరికొత్త ఆవిష్కరణ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఏఐ సాయంతో మెరుగైన సేవలు అందించడమే తమ టార్గెట్ అని అన్నారు. ఏపీని నాలెడ్జ్ హబ్‌గా మారుస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.